Sunday, May 15, 2011

ద్విభాష్యం నగేష్ బాబు - స్వరావిష్కరణోత్సవం


ద్విభాష్యం నగేష్ బాబు - స్వరావిష్కరణోత్సవం
ద్విభాష్యం నగేష్ బాబు
సృజించి, స్వరపరచిన
గురుస్మరణ & గ్లోరీ ఆఫ్ గోదావరి
ఆడియో సి.డి ఆవిష్కరణ.
రామచంద్రపురం

2 మే 2011


Note: Click on image to view large image.







స్వరావిష్కరణ చేసిన శ్రీ ఎమ్.వి. కృష్ణయ్య; సృజించి,స్వరపరచిన శ్రీ ద్విభాష్యం నగేష్ బాబు; అశీర్వచస్సులు- శ్రీ ఎ.ఆర్.కె. హరనాధ్ బాబు, శ్రీ టి.వి. సుబ్బరాయ శాస్త్రి; రసావిష్కరణ చేసిన శ్రీ అదృష్టదీపక్, శ్రీమతి ప్రయాగ అనసూయ మెమోరియల్ ట్రస్టు నిర్వాహకులు-‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ స్థానిక సమన్వయ కర్త శ్రీ ప్రయాగ నళినీ కాంత్..
ద్విభాష్యం నగేష్ బాబు గారికి అభినందన సత్కారం
‘వైణికాగ్రణి’ బిరుదుతో సత్కారం





























స్వరార్చన’ ‘కృతి’ కర్త శ్రీ ద్విభాష్యం నగేష్ బాబు గారి దంపతులకు అభినందన సత్కారం...






























గేష్ బాబు గారికి ఆశీర్వచనాలు అందిస్తున్న
వాయులీన విద్వాంసులు శ్రీ టి.వి. సుబ్బరాయ శాస్త్రి











కార్యక్రమ ‘సంచాల’కులు డాక్టర్ డి.బి. గాంధీబాబు, శ్రీమతి ఎ. పద్మలత


































































సుస్వరాగ నాట్య సమ్మేళనం

- శృంగారం వేంకట అప్పలాచార్యర్ (Andhra bhoomi)

రసజ్ఞ శ్రోతలకు రసైకానందం కలిగించడానికి శ్రీమతి ప్రయాగ అనసూయ మెమోరియల్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని శ్రీజగద్గురు జయేంద్ర సరస్వతి సన్‌షైన్ హైస్కూల్ ప్రాంగణంలో గురుస్మరణ స్వరావిష్కరణోత్సవాన్ని జనరంజకంగా నిర్వహించింది. ప్రముఖ వైణిక విద్వాంసులు ద్విభాష్యం నగేష్ బాబు సృజించి, స్వరపరచిన గురుస్మరణ ఆడియో సీడి ఆవిష్కరణోత్సవాన్ని

నగేష్ బాబు తొలి గురువు, వైణికులు, రిటైర్డ్ లెక్చరర్ ఎమ్‌వి కృష్ణయ్య ఆవిష్కరించారు. గురుస్మరణ ఆడియో సీడీలో 3 అంశాలు ‘‘సన్నిధి, శిక్షణ, సేవ’’ చోటు చేసుకోగా వాటిని రసజ్ఞ ప్రేక్షకులకు వినిపించే సమయంలో నగేష్ బాబు కుమారుడు తన బృందంతో నృత్య అభినయాన్ని ప్రదర్శించి, ఆహూతుల మన్ననలను అందుకున్నారు.


ప్రముఖ కవి, సినీ గేయ రచయిత అదృష్టదీపక్ రసావిష్కరణ చేస్తూ, 

గురు శిష్యుల సంబంధానికే అర్థం తెలియని నేటి ఆధునిక కాలంలో గురువులను స్తుతిస్తూ స్వరపరచిన వీణామృతం భారతదేశ సంస్కృతికి అద్దం పడుతుందన్నారు.
రచయిత్రి వాడ్రేవు వీర లక్ష్మీదేవి మాట్లాడుతూ 

గోదావరి వైభవానికి నగేష్ బాబు వీణపై చేసిన రూపకల్పనకు చిన్నారులు ప్రదర్శించిన నృత్యం.. వేదికపై నిజంగానే గోదావరి నదీ ప్రవహించిన తీరును తలపించిందన్నారు. విద్వాంసుడు తన ప్రతిభతో ఏ రాగానైన్నా ఎటువంటి సందర్భానికైనా ఉపయోగించవచ్చునని అంటూ నగేష్ బాబు శకుంతలకు వీడ్కోలు సన్నివేశానికి ధర్మవతి రాగంను అంత అర్థవంతంగా ఉపయోగించారన్నారు. శహన రాగంలో సన్నిధి అనే సంగీతాంశం గురువు చెంత శిష్యుడు పొందే స్వాంతనకు సంకేతంగానూ, హిందోళ రాగమాలిక సేవ అనే అంశం గురువు పట్ల శిష్యుడు ప్రదర్శించే ఉన్నత ధర్మానికి సంకేతమన్నారు.
నగేష్ బాబు గారికి ఆశీర్వచనాలు అందించి
మెమొంటో బహూకరీస్తున్న శ్రీ ఎం.వి కృష్ణయ్య
సి.డి తొలి ప్రతిని స్వీకరిస్తున్న
నగేష్ మాతృశ్రీ ద్విభాష్యం సుబ్బలక్ష్మి గారు
గోదావరి వైభవం, శకుంతలకు వీడ్కోలు అనే అంశాలను శ్రోతలకు వినిపించగా, ప్రముఖ కొరియోగ్రాఫర్‌లు సుధాకర్, శ్రీలక్ష్మిల నేతృత్వంలో వసంత కళ్యాణ్, మరో 13 మంది చేసిన నృత్యప్రదర్శన విశేషంగా అలరించింది. విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్న ప్రయాగ అనసూయ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకొంది. నగేష్ బాబుకు వైణికాగ్రణి అనే బిరుదును ప్రదానం చేశారు.

ఆడియో సి.డి ఆవిష్కరణ.
























































వైణికులు, వి.ఎస్.ఎమ్ కళాశాల విశ్రాంత ఉపన్యాసకులు శ్రీ ఎమ్.వి కృష్ణయ్య గారికి సత్కారం





ఆశీర్వచస్సులు అందించిన‘ వైణిక విదుషి’ శ్రీమతి నాగాభట్ల సీతాదేవిని సత్కరిస్తున్న శ్రీ ప్రయాగ నళినీ కాంత్, శ్రీమతి మాణిక్యాంబ దంపతులు









సత్కారం అందుకొన్న చింతలూరు వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం అధినేత శ్రీ డి.వి. శ్రీరామ్మూర్తి, శ్రీమతి పద్మ
















ఆశీర్వచనాలు అందిస్తున్న హరనాధ్ బాబు





రసావిష్కరణ గావిస్తున్న అదృష్టదీపక్






















నగేష్ బాబు కుమారుడు వసంత కల్యాణ్ బృందం నృత్య ప్రదర్శన
సత్కారం అందుకుంటున్న‘ సువాయులీనాచార్య’ టి.వి. సుబ్బరాయ శాస్త్రి
సత్కారం అందుకొంటున్న అదృష్టదీపక్






No comments:

Post a Comment